మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. Also Read…