ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన…