ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తోమేష్ వర్మపై దారుణమైన కత్తి దాడి జరిగింది. ఈ దాడి అత్యంత ప్రణాళికబద్ధంగా జరిగినది. దుర్గ్ జిల్లా నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు. డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్ళారని పోలీసులు…