ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాలకు పని చేసి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తెలుగునాటనే కాదు తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో దేవి పాటలను ఉపయోగించుకుని హిట్ కొట్టారు. ‘రెడీ’ సినిమాలో దేవి…