డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది.
డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…