గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం... విద్వేషాలు రెచ్చగొట్టే…
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. తాజగా నార్సింగ్ లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. రూ. 30 లక్షల విలువైన ఎస్టసీ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ తో పాటు.. ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. మణికొండ లో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా…
జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్‌లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది. జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్…
Drugs : హైదరాబాద్‌లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్‌ఫార్మర్‌గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు. ఈ మహిళ…
డ్రగ్స్ యువత జీవితాలను చిత్తు చేస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగర అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.. Also Read:NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్…
Drugs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం దాడుల్లో ఐసీస్ డ్రగ్ కలకలం రేపింది. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ అమ్మకాలను గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉన్న భార్గవ్ మెడికల్ షాప్ లో ఈ ఐసిస్ డ్రగ్స్ ను గుర్తించారు.
Merchant Navy officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంత దారుణంగా ఏ మహిళ చంపుతుందా..? అని మాట్లాడుకుంటున్నారు.
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నానాక్ రామ్ గూడ వద్ద 41 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ నగరంకు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది. Also Read: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!…
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే? గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం…