డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలని ఆదేశించారు.. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. ఇక, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్.. దీని కోసం ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ,…
మాదక ద్రవ్యాల సరఫరాపై రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్మగ్లర్లు పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పోలీసులు వారి ప్లాన్లను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా భారీగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్…
మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పంథాలను వెతుకుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ప్లాన్లు చేసిన కస్టమ్స్ అధికారులు తిప్పికొడుతున్నారు. అలాంటి ఘటనే ఇది .. ఉగాండా దేశానికి చెందిన జూడిత్ అనే వ్యక్తి భారీగా హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ చేసాడు. కస్టమ్స్ అధికారులను ఏమార్చి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పథకం పన్నాడు. దాని కోసం కేటుగాడు 7 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను…
నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్‌బాబు షేక్, నూర్ మహ్మద్…
హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రo గా మారుతుందా.. హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి. సంపన్నుల పిల్లలు చాలా వరకు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా. కాలేజీలో డ్రగ్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిందా. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారా.. వీటన్నిటికీ హైదరాబాద్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాదులో పెద్ద మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై మాఫియా హైదరాబాద్ లో తిష్ట వేసి…
హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు పోలీసులు, భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… డ్రగ్స్ ముఠాను నడుపుతోన్న ముంబై మాఫియాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు ఆ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా గుర్తించారు.. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఈ ముఠా నుంచి కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను సీజ్ చేశారు నార్త్ జోన్ టాస్క్…
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి కోకైన్ పట్టుబడటం సంచలనంగా మారింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా నేరగాళ్లు మాత్రం డ్రగ్స్ సప్లయ్‌కు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా సిని ఫక్కీలో కోకైన్ ను తరలించే యత్నం చేసిన కిలాడి లేడిని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోకైన్‌ను చిన్న చిన్న క్యాప్‌సెల్స్‌లో నింపి కడుపులో దాచిన కిలాడిలేడీ ఆటలు కస్టమ్స్ అధికారుల వద్ద సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 91 క్యాప్…
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్‌లో విచారణ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి, అందులో 14 కోట్ల విలువ చేసే 2.2…
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం…
చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసులో ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అమెరికా, నెదర్లాండ్స్ నుండి చెన్నై వచ్చిన మూడు పార్శిల్ లో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మూడు పార్శిల్ లో డ్రగ్స్ దాచి కేటుగాళ్లు పోస్టాఫీసు ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు. పార్శిల్స్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడింది. పార్శిల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామాలపై కస్టమ్స్ బృందం…