హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్‌లో…
pistols and ganja seized: గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు వైల్డ్‌గా మారుతున్నారు. తమ దందాను అడ్డుకున్నా.. ఎవరైనా అడ్డు వచ్చినా.. అక్కడికక్కడే చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇందుకోసం ఏకంగా మారణాయుధాలు పెట్టుకుని మరీ దందా సాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఒకప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లర్లు… పోలీసులు దాడి చేసే సమయంలో తమ దగ్గర ఉన్న గొడ్డళ్లు.. రాళ్లు ఆయుధాలుగా వాడేవారు. ఇప్పుడు…
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అహ్మద్ నగర్ మహారాష్ట్రాకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు గతంలో మహారాష్ట్ర లో కిరాణా షాపుతోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మఖాం మార్చాడు. అక్కడ ఆన్ లైన్ లో డ్రగ్స్ కు సంబంధించి సెర్చింగ్ చేశాడు. దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి…