Off The Record: పుట్టా మహేష్ ఎపిసోడ్ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీ పుట్టా మహేష్..
- యనమల రామకృష్ణుడికి స్వయానా అల్లుడు పుట్టా..
- మహేష్ ఎపిసోడ్ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?..
- కొన్నాళ్ళుగా పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టు యనమల..
- రాజ్యసభ సీటు లేదా గవర్నర్‌గిరీ మీద ఆశలు..
- రాజ్యసభకు వెళ్ళడం తన జీవితకాల కోరిక అన్న యనమల..
- ఇప్పుడు అల్లుడి దెబ్బకు ఆశలకు గండి పడ్డట్టేనా?..
- రామకృష్ణుడికి ఏ పదవి ఇచ్చినా నెగెటివ్ అయ్యే ప్రమాదం ఉందా?..
- ప్రతిపక్షం డ్రగ్స్ కేసుని ఇంకా హైలైట్ చేస్తుందన్న భయాలున్నాయా?..
- డ్రగ్స్ కేసులో ఉన్నవాళ్ళ ఫ్యామిలీకి పదవులతో రాంగ్ ఇండికేషన్స్?.. కెరీర్ చివర్లో సన్ ఇన్లాతో యనమలకు లాస్?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పొలిటికల్ లీడర్స్‌కు సన్‌స్ట్రోక్స్ కామన్. కానీ… టీడీపీ సీనియర్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మాత్రం సన్ఇన్లా స్ట్రోక్ బాగా…. గట్టిగా తగులుతోందట. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన ఎంపీ పుట్టా మహేష్ యనమలకు స్వయానా అల్లుడు. అందుకే… ఆ ఎఫెక్ట్ ఎక్కడ తన అవకాశాన్ని దెబ్బ కొడుతుందోనని కంగారు పడుతున్నారట సీనియర్. పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్‌పై టీడీపీ అధిష్టానం బాగా సీరియస్‌గా ఉంది. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు వెళ్ళాలంటూ స్వయంగా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పుట్టా పై ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. ఇప్పుడీ డ్రగ్స్ కేసుతో తాను ఇరుక్కోవడమేగాక పార్టీని కూడా డిఫెన్స్‌లో పడేశారన్న చర్చలు జరుగుతున్నాయి టీడీపీ వర్గాల్లో. ఇది ఇక్కడితో ఆగితే అది వేరే సంగతి. మొయినాబాద్‌లో కట్ అయిన సీన్ అమరావతిలో యనమల రామకృష్ణుడి రాజకీయ భవితవ్యం దగ్గర ఓపెన్ అవుతుందన్న భయం పెరుగుతోందట. అల్లుడి వ్యవహారాలతో పార్టీ పెద్దల దగ్గర ఇక ఆయన నోరు తెరవగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విడత తప్ప… గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా… యనమలకు మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుగా ఉండేది. పవర్ లేనప్పుడు కూడా ఆయనకు మాత్రం ఏదో ఒక అధికారిక హోదా కొనసాగేది. కానీ… ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్సీగా పదవీకాలం అయిపోయాక ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అటు ఆయన కూడా పార్టీ వ్యవహారాలతో టచ్‌మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు.
చాలా రోజుల నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా హాజరవడం లేదు. ఎందుకలాగంటే…. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సీటుగాని, గవర్నర్గిరీగాని ఆశిస్తున్నారట. ఏదో ఒకటి వెంటనే కావాలన్నంత ఆత్రంగా యనమల ఉన్నా… ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే వారసులకు ఛాన్స్ ఇచ్చి కొందరు సీనియర్స్‌ను పక్కకు పెట్టే కార్యక్రమం నడుస్తోంది పార్టీలో. అయినాసరే… తన సీనియారిటీని గుర్తించి రాజ్యసభకు పంపాలని, పొలిటికల్‌గా అదొక్కటే తన జీవిత లక్ష్యమంటూ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు యనమల. తేడాలేమీ జరక్కుంటే పరిస్థితులు ఎలా ఉండేవోగానీ, ఇప్పుడు మాత్రం…. ఉరుము లేని పిడుగులా అల్లుడి ఎపిసోడ్ రామకృష్ణుడి నెత్తిన పడింది. కాస్త అటో ఇటో… తన జీవితకాల కోరికను నెరవేర్చుకునే అవకాశాలకు అల్లుడి రూపంలో గండి పడ్డట్టేనని అభిప్రాయపడుతున్నాయి రాజకీయవర్గాలు. ఆ ఎపిసోడ్ తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని పార్టీ పెద్దల దగ్గరికి వెళ్తారు? తనకు పదవి కావాలని ఎలా డిమాండ్ చేయగలుగుతారంటూ చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. కేసులో ఇరుక్కున ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవితవ్యం సంగతేమోగానీ… ఆ దెబ్బకు ఆయన మామ రామకృష్ణుడికి డోర్స్ క్లోజ్ అయినట్టేనన్న అంచనాలు పెరుగుతున్నాయి.
Also Read
ఇప్పటికే పుట్టా పై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు…. ఇక ఆ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని, ఆ ప్రకారం చూసుకున్నా… సీనియర్ లీడర్‌కు దారులు మూసుకుని పోయినట్టేనన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో రకరకాల ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలోమళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలపడవచ్చని అంటున్నారు. ఏపీ నుంచి త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకటి ఆశిస్తున్నారు యనమల. టీడీపీ సీనియర్స్‌లో ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే… ఆయనకు వస్తే రావచ్చు. కానీ…. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఈయనా గట్టిగా అడగలేరు, వాళ్ళూ అంత సుముఖంగా ఉండకపోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. ఇప్పుడు గనుక రామకృష్ణుడికి పదవి ఇస్తే…. ప్రతిపక్షం డ్రగ్స్ కేసుని ఇంకా హైలైట్ చేసే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇప్పటికే ఎన్ని విమర్శలు వచ్చినా కొంత మంది ని చంద్రబాబు కొన్ని పోస్టుల్లో కొనసాగిస్తూన్నారని, అలాంటిది ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారి కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మొత్తానికి ఈ సీనియర్ లీడర్ పొలిటికల్ కెరీర్ చివర్లో సన్ ఇన్ లా….. బాగా లాస్ చేశారన్న అభిప్రాయం బలంగా ఉంది. యనమల రామకృష్ణుడు తన జీవితకాల కోరిక నెరవేర్చుకుని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారా? లేక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!