Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. చాదర్‌ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేశారు. సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాదంతానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను తాము రౌడీషీటర్లమని చెప్పుకుంటూ స్థానిక సెల్‌ఫోన్ రిపేర్ షాపులో దౌర్జన్యానికి దిగారు.