వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.