Manhole : ప్రస్తుతం ఏ సీజనో కూడా జనాలకు అర్థం కావడంలేదు. మే నెల మధ్యకు వస్తుంది.. ఈ టైంలో భానుడు భగభగామండాల్సింది పోయి.. వరుణుడు కనికరం లేకుండా జోరుగా వాన కురిపిస్తున్నాడు. చెరువులు ఎండిపోవాల్సిన టైంలో నిండి అలుగులు పోస్తున్నాయి.
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పీవిపురం వాగులో ఓ మహిళ గల్లంతయింది. పీవీపురంవాగు దాటుతూ వుండగా నీటి వేగానికి అదుపు తప్పి.. ఓ మహిళ గల‌్లంతైంది. పీవిపురానికి చెందిన ఇద‌్దరు మహిళలు, ఒక యువకుడు పొలం వద్ద నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వాగును దాటుతుండగా ప్రవాహం వేగానికి కొంతదూరం కొట్టుకొని పోయారు. యువకుడు ఒకరిని రక్షించ గలిగాడు. ఈ ప్రమాదంలో 37 ఏళ్ళ సరళ అనే మహిళ వాగులో కొట్టుకు పోయింది. సమాచారం తెలుసుకున‌్న…