ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది. ఏ పెర్ఫార్మెన్స్ అయితే ముందు నుంచి కోరుకుంటున్నామో.. అలాంటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై తాండవం చేసి, భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అవును, విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20…