ఈ రోజుల్లో అనేక ఒత్తిళ్లు పని ఒత్తిడి, ఆలస్య పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు సంతానం కలగడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రతి ఆరు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. భారత్‌లో ఈ సంఖ్య 2.7 కోట్ల జంటలకు పైనే. ఇది కేవలం వైద్య సమస్య కాదు; భావోద్వేగ, సామాజిక ఒత్తిళ్లు కూడా జతయ్యాయి. ఆలస్య గర్భాలు, ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు…