కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ నుంచి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంచుకుంది.. ఇక, ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లకు సైతం ఆమోదం తెలిపింది కేంద్రం.. దీంతో.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయతే, భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, త్వరలోనే తేల్చేందుకు మాత్రం…
కరోనా మహమ్మారి కట్టడికోసం ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రపంచదేశాలతో పాటు.. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇప్పటికే దేశ్యాప్తంగా 62.29 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది భారత్.. ఇక, శుక్రవారం ఒకేరోజు కోటి డోసులు వేసి.. మరో అరుదైన ఘనత సాధించారు.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.. భారత్‌లో ఒకేరోజు కోటి మందికి వ్యాక్సినేషన్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్.. సోషల్ మీడియా వేదికగా…
భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది..…