అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి సరైన పరిష్కారమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా…