డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.