Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి…