Donald Trump's 2020 India Visit: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను అధికారంలో ఉన్నప్పుడు 2020లో మొదటిసారిగా ఇండియాలో సందర్శించారు. దాదాపుగా 36 గంటల పాటు ఇండియాలో గడిపారు ట్రంప్. ట్రంప్ తో పాటు ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ అయిన మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్లతో పాటు అమెరికా ఉన్నతాధికారులు ఇండియాలో పర్యటించారు. 2020 ఫిబ్రవరి 24-25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో ట్రంప్ పర్యటన సాగింది.