Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు…