యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ట స్థాయికి ఎందుకు చేరుకుంటోంది? డాలర్, రూపాయి మధ్య అంతరం క్రమంగా ఎందుకు పెరుగుతోంది? అని ప్రజలు ఆలోచనలో పడిపోయారు. ఒక డాలర్ విలువ వంద రూపాయలు దాటవచ్చని కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, అమెరికా భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది, కొన్నిసార్లు…