Telugu Lady Inspirational Story: మనిషికో చరిత్ర. కానీ.. అందరివీ అంత ఆసక్తికరంగా ఉండవు. ఆదర్శంగా అసలే అనిపించవు. అయితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళది మాత్రం సూపర్ హిట్ సినిమాకు మించిన ఇంటస్ట్రింగ్ స్టోరీ. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. చదువు మానేసిన 30 ఏళ్ల తర్వాత 49 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌లో చేరి 53 ఏళ్ల వయసులో విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు.