చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై శరత్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుత సమాజంలో హిందువుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. “నేడు హిందువులుగా ఉన్నవారు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని,…