నోబెల్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే బహుమతి. వివిధ రంగాల్లో ఉద్దండులకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. అలాంటిది ఓ రష్యా జర్నలిస్టు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ నోబెల్ శాంతి బహుమతిని సోమవారం వేలం వేశారు. ఈ వేలంలో నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103.5మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. మురాతోవ్ 2021లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్…
2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు పాత్రికేయులను వరించింది.. ఈ ఏడాది ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్ అనే జర్నలిస్టులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసలు కురిపించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ… అందుకే వీరిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. జర్నలిస్టు మరియా రెసా.. ఫిలిప్పీన్స్‌లో…