తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచినీటి కుళాయి కోసం తవ్విన గోతిలో పడి నాలుగున్నర ఏళ్లు బాలుడు శ్రీను మృతి చెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అనంతలోకల్లా కలిసిపోవడంతో దివాన్ చెరువు గ్రామంలో విషాదం అలుముకుంది.
అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు..