మహానాడు ముగిసినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోన్న నటి దివ్యవాణి రాజీనామా వ్యవహారానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం.. తాను తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు దివ్యవాణి స్పష్టం చేశారు. నిజానికి.. దివ్యవాణి రాజీనామా వ్యవహారం సినిమాటిక్‌గా సాగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మహానాడు ముగిసిన వెంటనే దివ్యవాణి ట్విటర్ మాధ్యమంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని…