అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఐటం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.…