Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాను ఏఫెక్ట్ గట్టిగానే తాకింది. దిత్వా ఏఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుఫాను కదులుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ…