శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు చేయడం కలకలం రేపింది. అయితే, జిల్లా రిజిస్ట్రార్ పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను అధికారులు అనుమతించలేదు. వీడియోలు తీసేందుకు నిరాకరించారు అధికారులు. సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఓ రిపోర్టర్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని వీడియోలు తొలగించారు అధికారులు. శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహింనట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్…