మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్‌ను పొడిగించారు.