దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఇవాళ జరిగిందని.. మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడానని ఆయన తెలిపారు. ఈ కమిటీలో కేంద్ర పధకాల అమలు గురించి చర్చించామన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు.