No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మరోసారి వేడెక్కనుంది. ఈ ప్రతిపాదనపై ఆగస్టు 8 నుంచి చర్చలు ప్రారంభమవుతాయని, ఇది మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 10 వరకు ఉంటుందని సమాచారం. విశేషమేమిటంటే.. చర్చల చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటులో సమాధానం చెప్పబోతున్నారు.