కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన ‘నిద్రగన్నేరు చెట్టు’ ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ విస్మయం చెందారు. Also Read: RJ Shekhar Bhasha: ఆర్జే శేఖర్ బాషాపై కేసు…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను,…
ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం.…