దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని,…