పొట్టివాడైనా గట్టివాడు అంటుంటారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని. ఏది చేసినా పక్కా ప్లానింగ్ తో చేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాంటి అరవింద్ ని కూడా బురిడీ కొట్టించారు మలయాళ నిర్మాతలు. మలయాళంలో గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘నాయట్టు’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రంజిత్, శశిధరన్ తో కలసి దర్శకుడు మార్టిన్ ప్రకట్ నిర్మించారు. చిన్న పాయింటు చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లుకుని చేసిన ఈ…