యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “18 పేజెస్”, “కార్తికేయ 2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. భారీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.…