ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను…