డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. “ఎంతోమంది అందగత్తెలు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మవచ్చు గాక… డింపుల్ అందం వేసిన బంధాలే వేరు” అంటూ కీర్తిస్తున్న వారూ లేకపోలేదు. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చింది. 16 ఏళ్ళ సమయానికి ముగ్ధమనోహరంగా ‘బాబీ’లో మురిపించింది. ‘షో మేన్’ రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘బాబీ’ పాటలతో అలరించడం ఓ ఎత్తయితే,…