రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు.