ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన బిజినెస్ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్న చోట మాత్రమే లాభదాయకమైన మార్కెట్ మనుగడ సాగిస్తుందని ప్రధాని అన్నారు. ఇతర దేశాలను మార్కెట్‌గా పరిగణించడం ఎప్పటికీ పనికిరాదని అన్నారు.