ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఆఫర్ వస్తే.. ఎవరు వదులుకుంటారు చెప్పండి? దీనికితోడు నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ రెండింటిని (ఆశ, నిరుద్యోగం) ఆసరాగా తీసుకొని, ఓ ప్రైవేట్ కంపెనీ వందల మందికి కుచ్చటోపీ పెట్టింది. వారి వద్ద నుంచి కోట్లు దండుకొని, పత్తా లేకుండా మాయమైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ సంస్థ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమది యూఎస్ బేస్డ్ కంపెనీ అని,…