హిందీ చిత్రసీమలో కండలు తిరిగిన సౌష్టవంతో స్టార్స్ గా రాణించిన ఆ నాటి నటుల్లో ధర్మేంద్ర స్థానం ప్రత్యేకమైనది. ‘మేచో మేన్’గా పేరొందిన తొలి హిందీ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. అప్పట్లో ఎంతోమంది అందాలభామల కలల రాకుమారునిగా ధర్మేంద్ర రాజ్యమేలారు. ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలభామను తన సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. తనదైన అభినయంతో ధర్మేంద్ర బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ అలరిస్తూ సాగారు. కలర్ సినిమా రోజుల్లో అయితే ధర్మేంద్ర…