Idli Kottu: హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.