భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ధనశ్రీ వర్మ నుంచి విడాకులపై చాహల్ మౌనం వీడాడు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో జరిగిన ఇంటర్య్వూలో, ధనశ్రీ గురించి చాలా పుకార్లు వచ్చినప్పటికీ తాను ఎప్పుడూ ఆమెను మోసం చేయలేదని చాహల్ స్పష్టం చేశాడు. విడాకులు ఖరారు అయ్యే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచామని తెలిపాడు. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు మొదలయ్యాయని యుజ్వేంద్ర…