Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో, ఆ దేశ రాజధాని ఢాకాలో దుండగులు బాంబు దాడి చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) బహిష్కృత నాయకుడు తారిఖ్ రెహమాన్ పర్యటనకు కొద్ది రోజుల ముందు, క్రిస్మస్ పండుగ ముందు రోజు ఢాకాలో తాజా హింస చెలరేగింది. బుధవారం సాయంత్రం రాజధానిలోని మొఘ్‌బజార్ కూడలి వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సందస్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన నాటు బాంబు పేలుడులో ఒకరు మరణించారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. షేక్ హసీనా కాలంలో జరిగిన ఉద్రిక్తతల కంటే ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ మతోన్మాద విద్యా్ర్థి నాయకుడు షరీప్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలో అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి, తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాది చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఇతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ భగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్లీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు. Read Also:…
Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలం, భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణించారు. అనంతరం.. వేలాది మంది షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత, భారత్‌పై ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారో, అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల భద్రతను పట్టించుకోవడం లేదు. యూనస్ సర్కారులో మతోన్మాదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో ఓ స్క్రాప్…
Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.