ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి. ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు? దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దని డీజీపీకి తెలుపుతున్నాను. తూర్పు గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో బలైపోయాడు. సుబ్రమణ్యం మరణానికి అసలు కారణాన్ని అన్వేషించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు…
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసు సంచలనంగా మారింది.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. అయితే, ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ జరిపించాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం…
తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. డీజీపీ మహేందర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదన్నారు మహేందర్ రెడ్డి. మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్ (SCAPULA ) కు మూడు చోట్ల Hairline fractures జరిగాయని ఎక్స్ -రే,…
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీగా ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. నాపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా…
గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి సోమవారం చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలోభాగంగానే చేశారన్నారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు…
వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని కీలక వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా రెక్కీ వివరాలను ఆరా తీశారు చంద్రబాబు. రాధా భద్రతకు గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే వాటిని తిరస్కరించారు రాధా. తాజాగా చంద్రబాబు -రాధా ఇంటికి వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడలో క్లబ్ దగ్గర ఉన్న వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు చంద్రబాబు. వంగవీటి రాధ హత్యకు జరిగిన…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త ను కిడ్నాప్ చేసి తీవ్రంగా చితకబాది వదిలేశారు వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మురళి ని తీసుకెళ్ళారు సెంథిల్ కుమార్ అనుచరులు. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు మురళి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ములకల పల్లె గ్రామానికి చెందిన మురళి.…
అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
గోశామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మాజీ ఉన్నాతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. దేశ భద్రతలో పోలీసుల సేవలు చిరస్మరణీయ నీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో 377మంది పోలీసులు అమరులయ్యారన్నారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ఇందులో10మంది హోం…