తెలంగాణలో క్యాడర్ అలాట్‌మెంట్ పై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెలవడనుంది. నేటితో 11 మంది ఆలిండియా సర్వీస్ అధికారుల భవిష్యత్ తేలనుంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై కూడా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా నిందుల డేటా బేస్ మన దగ్గర ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వం దిశా, నిర్దేశం చేసిందని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్స్‌లో భాగంగా భద్రాద్రి, ములుగు జిల్లాలో పర్యటించినట్లు డీజీపీ వెల్లడించారు.
EC Shocking decision: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని సుమారు 900 మంది అధికారులను బదిలీ చేసింది.
కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవిపై దాడి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. లేఖతో పాటు ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీని చంద్రబాబు జతచేశారు. వైసీపీ గూండాల వల్ల కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని ఆయన లేఖలో వివరించారు. గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవి నివాసంపై దాడి కుప్పంలో వైసీపీ అరాచకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న రవి ఇంటిపై వైసీపీ…
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం…
అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి…