Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.. మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ సైతం కాబోయే ఏపీ సీఎంకు శుభాకంక్షలు తెలిపారు..
Read Also: Kajal Aggarwal: చందమామ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
మరోవైపు.. చంద్రబాబు నివాసానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మాసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మనంద రెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్.. ఇలా పలువురు నేతలు చంద్రబాబును కలిశారు.. కేశినేని చిన్ని, బోండా ఉమా, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు కూడా చంద్రబాబును కలిసి వెళ్లారు.. మరోవైపు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందు.. నందమూరి బాలకృష్ణ, రామానాయుడు, కొల్లురవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్, పార్థసారథి తదితర నేతలు కూడా ఆయన్ని కలసి అభినందనలు తెలిపారు.