కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని పేర్కొంది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు విమాన ప్రయాణికులను హెచ్చరిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. కొవిడ్ సేఫ్టీ నిబంధలను…