రాష్ట్రంలో మహిళల భద్రతపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు, సిబ్బందితో ఆగస్టు 8వ తేదీ గురువారం నాడు డిజి (మహిళా భద్రత) తెలంగాణ శిఖా గోయెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 300 మంది అధికారులు, సిబ్బంది సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. షీ టీమ్‌లు ఇప్పటివరకు రూపొందించిన ‘బలమైన భద్రతా అవగాహన’పై శిఖా గోయెల్ చాలా దృష్టి పెట్టారు. ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే హాట్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి…